ETV Bharat / jagte-raho

లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం పట్టివేత - వైరాలో రేషన్​ బియ్యం పట్టివేత

ఖమ్మం జిల్లా వైరాలో అక్రమంగా తరలిస్తున్న 150 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని.. వాటిని తీసుకెళ్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. సంతబజార్​లో బురదలో లారీ దిగిపోగా.. పోలీసులు పట్టుకున్నారు.

illegal ration rice caught by police at wyra
లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం పట్టివేత
author img

By

Published : Sep 28, 2020, 3:09 PM IST

ఖమ్మం జిల్లా వైరాలో లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. స్థానిక సంతబజారులో ఓ ఇంట్లో నిల్వ చేసిన బియ్యాన్ని తరలించేందుకు లారీ లోడ్​ చేశారు. సుమారు 150 క్వింటాళ్ల బియ్యాన్ని లారీలో తరలిస్తుండగా.. కొద్ది దూరంలోనే బురదలో దిగబడింది.

కొద్దిసేపటి తర్వాత రేషన్​ బియ్యం లారీని పోలీసులు గుర్తించారు. ఎస్సై సురేష్​ ఘటనాస్థలానికి చేరుకుని లారీని పోలీస్​స్టేషన్​కు తరలించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వ్యక్తిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: అభ్యుదయ కవితా యుగంలో ఆయన ఓ ధ్రువతార

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.