ETV Bharat / jagte-raho

అత్తమామల వేధింపులతో వివాహితుడు ఆత్మహత్య

కూతురునిచ్చి పెళ్లి చేశారు. తనతో పాటే అల్లుని ఇంట్లో ఉన్నారు. కొత్త దంపతుల మధ్య ఘర్షణలు తలెత్తేలా చేశారు. గొడవల వంకతో... తమ కూతురిని తీసుకెళ్లిపోయారు. భర్త ఎన్నిసార్లు బతిలాడినా... భార్య ఎంతకూ రాకపోయేసరికి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

husband suicide for wife not coming his home

author img

By

Published : Oct 7, 2020, 2:16 PM IST

అత్తమామల వేధింపులు భరించలేక ఓ వివాహితుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్​ కంచన్‌బాగ్‌ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాబానగర్‌లో నివాసించే 23 ఏళ్ల సయ్యద్ మోహిన్‌కు కామారెడ్డికి చెందిన యువతితో ఏడాది క్రితం వివాహం జరిగింది. భార్య తల్లిదండ్రులు సైతం సయ్యద్‌ ఇంట్లోనే కొన్ని రోజులు ఉన్నారు. కూతురు కాపురంలో కలహాలకు కారణమయ్యారు. అదే గొడవలను వంకగా చేసుకుని కూతురిని తమ సొంతూరికి తీసుకువెళ్లారు.

భార్యను కాపురానికి రమ్మని పలుమార్లు బతిలాడినా ఫలితం లేకపోయింది. మనస్తాపంతో అర్ధరాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: హైదరాబాద్​లో నేరాలు తగ్గాయి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.