ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తిరువూరు మండలం మునుకొల్లులో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో.. భర్త తన భార్యను రోకలి బండతో మోది దారుణంగా హతమార్చాడు. గ్రామానికి చెందిన యరమల నర్సిరెడ్డికి తన భార్య నాగమణి ప్రవర్తనపై అనుమానం ఉంది. ఈ క్రమంలో భార్యాభర్తలు తరచూ గొడవపడేవాళ్లు. ఇదే క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఆగ్రహంతో ఉన్న నర్సిరెడ్డి పక్కనే ఉన్న రోకలి బండను తీసుకుని నాగమణి తలపై బలంగా కొట్టడంతో.. అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నర్సిరెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: రోడ్డుపై పడిపోయినట్లు నటిస్తారు.. సెల్ కాజేస్తారు.!