యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. గ్రామ శివారులోని పురాతన దుర్గమ్మ దేవాలయం వెనుక దుండగులు గుప్త నిధులకై గోతులు తవ్వారు. ఆలయ పరిసరాలు గమనించిన గ్రామ సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆలేరు పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రమేష్ తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా పంజా: దేశంలో ఒక్కరోజే 90,632 కేసులు