కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం తిప్పపూర్ గ్రామానికి చెందిన సిద్దరామేశ్వర్ అనే వ్యక్తి ఇల్లు నేల కూలింది. ఆ కుటుంబం రోడ్డున పడింది. గ్రామంలో పారిశుద్ధ్య పనుల పేరుతో మురికి కాలువల నిర్మాణం మొదలుపెట్టిన గుత్తేదారు.. తన ఇంటి ముందు జేసీబీతో కాలువ కోసం పూడిక తీశారు. పూడిక తీసి కొన్ని నెలలు గడుస్తున్నా పనులు మొదలుపెట్టకపోవడం వల్ల గ్రామంలోని మురికి నీరంతా ఈ కాలువలో చేరి పక్కనే ఉన్న సిద్దరామేశ్వర్ ఇంటి గోడలు బలహీన పడ్డాయి.
ఒక్కసారిగా శనివారం రోజున ఇల్లు నేలకూలింది. ముందే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీయడం వల్ల ప్రాణాపాయం తప్పింది. గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే తాము రోడ్డున పడ్డామని సిద్దరామేశ్వర్ కుటుంబ సభ్యులు వీధిలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమకు కొత్త ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి : గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..