సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం శ్రీనివాసపురంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతం వల్ల గ్రామానికి చెందిన దైద ఉపేందర్ అనే వ్యక్తి ఇల్లు కాలిపోయింది. గుర్తించిన స్థానికులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయింది. ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.
ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఉపేందర్.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి.. గాలిపటం ఎగురవేస్తుండగా కరెంట్ షాక్... బాలుడి మృతి