కర్నూల్ జిల్లా అదోనిలో ఫిజియోథెరపీ వైద్యుడు హత్య ఉదంతం మలుపు తిరిగింది. కులాంతర వివాహం చేసుకున్నందుకే తన భర్తను.. తమ తల్లిదండ్రులే హత్య చేశారని మృతుని భార్య ఆరోపించింది.
హత్యకు గల కారణాలు
నందవరం మండలం గురజాల గ్రామానికి చెందిన డాక్టర్ ఆడమ్ అస్మిత్, మహేశ్వరి ప్రేమించుకున్నారు. ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వారు రెండు నెలల క్రితం ఆర్య సమాజ్లో వివాహం చేసుకున్నారు. ఇది నచ్చని తన తల్లిదండ్రులే భర్తను హత్య చేశారని ఆమె ఆరోపించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : నూతనంగా ఎన్నికైన భాజపా కార్పొరేటర్ కరోనాతో మృతి