ETV Bharat / jagte-raho

కర్రలు, కత్తులతో మత్స్యకారుల దాడి.. 15మందికి గాయాలు

చాలా కాలంగా వివాదంగా ఉన్న ఇరువర్గాల వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతంలో మత్స్యకారుల్లో రెండు వర్గాల గొడవ మరోసారి తారా స్థాయికి చేరుకుంది. చేపల వేట విషయంలో తలెత్తిన గొడవతో కోపోద్రిక్తులైన ఓ వర్గం మత్స్యకారులు వాడరేవులో ఉంటున్న మత్స్యకారులపై కర్రలు, కత్తులతో దాడికి దిగారు. ఫలితంగా 15 మందికి గాయాలయ్యాయి.

high-tension-at-chirala-vodarevu-in-prakasam
కర్రలు, కత్తులతో మత్స్యకారుల దాడి.. 15మందికి గాయాలు
author img

By

Published : Dec 11, 2020, 10:29 PM IST

కర్రలు, కత్తులతో మత్స్యకారుల దాడి.. 15మందికి గాయాలు

ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సముద్రంలో చేపలు పట్టే విషయంలో వేటపాలెం మండలంలోని కటారివారిపాలెం, రామాపురం మత్య్సకారులు.. వాడరేవు మత్స్యకారుల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో కటారివారిపాలెం, రామాపురం మత్స్యకారులు ఒక్కసారిగా వందల సంఖ్యలో వచ్చి... వాడరేవు మత్స్యకారులపై దాడికి దిగారు. కర్రలు, కత్తులతో విచక్షణారహితంగా దాడులు చేశారు. ఈ ఘటనలో గాయపడిన 15 మందిని చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జాలర్లను చెదరగొట్టారు.

మత్స్యకారుల మధ్య ఘర్షణ

వివాదం ఏంటంటే...?

సముద్రంలో వేట విషయంలో మత్య్సకారుల్లో పట్టపు, ఓడ బలజీల మధ్య చాలా కాలంగా వివాదం నెలకొంది. వాడరేవుకు చెందిన మత్స్యకారులు బల్లలాగుడులను వినియోగిస్తున్నారని, దీనివల్ల మత్య్స సంపద పెరిగిందని రామాపురం, కటారిపాలెం తదితర గ్రామాల మత్స్యకారులు అభ్యంతరం చెబుతున్నారు. దీనికితోడు సరిహద్దు వివాదం కూడా ఉంది. ఈ విషయంలో ఇరువర్గాలు ఘర్షణలకు దిగుతున్నాయి. ఇటీవల జిల్లా కేంద్రంలో ఇరువర్గాలు మత్స్యశాఖ కార్యాలయం ముందు ధర్నా చేపట్టాయి. ఇరువర్గాలను కూర్చోబెట్టి వివాదం పరిష్కరిస్తామని అధికారులు సయోధ్య కుదిర్చారు.

సమస్య పరిష్కారం కాకపోవడంతో రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్‌ వద్దకు ఇరువర్గాలు వేరువేరుగా వెళ్లి సమస్యను చెప్పుకున్నారు. అంతలో మళ్లీ వేటలో సరిహద్దు సమస్య వచ్చింది. ఒకరి బోట్లు ఒకరు అనధికారికంగా స్వాధీన పరుచుకున్నారు. కటారివారిపాలెంకు చెందిన బోట్లు తిరిగి తీసుకువెళ్ళేందుకు వేటపాలెంకు చెందిన కొంతమంది మత్స్యకారులు రావడం వల్ల మళ్లీ ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఫలితంగా వీరంతా తమ గ్రామానికి వెళ్ళి జరిగిన విషయం చెప్పడంతో రామాపురం మత్స్యకారులను వెంట తీసుకొని వాడరేవుకు ఒక్కసారి చేరుకున్నారు. కర్రలకు కత్తులు కట్టి వాడరేవు మత్య్సకారులపై దాడికి దిగారు. ఇరువర్గాలు ఘర్షణలో 15మందికి గాయాలు కాగా... ద్విచక్ర వాహనాలు, కార్లు ద్వంసమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రెండు వేల మంది పాల్గొన్నారని సమాచారం.

ఇరువర్గాల మధ్య ఘర్షణ

రంగంలోకి పోలీసులు

ఇదీ చూడండి: సీటు కింద దాచారు.. అడ్డంగా బుక్కయ్యారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.