ETV Bharat / jagte-raho

హేమంత్​ కేసు: కోర్టుకు ప్రధాన నిందితులు

హేమంత్​ హత్య కేసులో ప్రధాన నిందితులు ఇద్దరిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వీరిద్దరి నుంచి రాబట్టిన సమాచారంతో మిగిలిన ఏడుగురిని ప్రశ్నిస్తున్నారు.

hemanth murder case two main accused produced in court
హేమంత్​ కేసు: కోర్టుకు ప్రధాన నిందితులు
author img

By

Published : Oct 7, 2020, 5:28 PM IST

గత నెలలో పరువు హత్యకు గురైన హేమంత్​ కేసులో ప్రధాన నిందితులు అవంతి మేనమామ యుగంధర్​రెడ్డి, తండ్రి లక్ష్మారెడ్డిలను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ఏడుగురిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

హేమంత్​ హత్య కేసులో లక్ష్మారెడ్డి, యుగంధర్​రెడ్డిల నుంచి రాబట్టిన సమాచారంతో మిగిలిన ఏడుగురిని పోలీసులు విచారిస్తున్నారు.

సెప్టెంబర్​ 25వ తేదీన హైదరాబాద్​లో కలకలం సృష్టించిన పరువుహత్య కేసులో చందానగర్​కు చెందిన హేమంత్ మరణించారు. తన ఇంటికి ఎదురుగా ఉండే అవంతిని ప్రేమించి జూన్​ 10వ తేదీన వివాహం చేసుకున్నాడు. పెళ్లిని అంగీకరించని యువతి కుటుంబసభ్యులు కిరాతకంగా హేమంత్​ను హత్య చేయించారు. ఈ కేసులో ప్రమేయమున్న ప్రతి ఒక్కరినీ శిక్షిస్తామని సీపీ సజ్జనార్ బాధితులకు హామీ ఇచ్చారు.

ఇవీచూడండి: హేమంత్‌ హత్యకేసులో కస్టడీకి మరో ఏడుగురు నిందితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.