హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రిషి భరద్వాజ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని తన క్వార్టర్స్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సమస్యలే కారణమని భావిస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన భరద్వాజ్ మెడికల్ సైన్స్ విభాగంలో పనిచేస్తున్నారు.
ఇవీచూడండి: వరకట్న వేధింపులతో ఏవో అరుణ ఆత్మహత్య.. తండ్రి ఫిర్యాదు