ETV Bharat / jagte-raho

ఓటీపీ చెప్పమన్నారు.. ఉన్నదంతా దోచేశారు!

బ్యాంకు వాళ్లు మీ పిన్ మార్చమని అడగరు... ఏ అధికారి ఓటీపీ చెప్పమని ఫోన్ చేయరు అప్రమత్తంగా ఉండండి అంటూ ఓ పక్క పోలీసులు... మరో పక్క అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. సైబర్ నేరగాళ్ల మాయమాటలకు చిక్కి.. నగదును పోగొట్టుకుంటున్నారు అమాయకులు. ఏపీలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఈ తరహాలోనే మోసపోయి... నగదు పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Breaking News
author img

By

Published : Jan 19, 2021, 10:45 AM IST

సైబర్ నేరగాళ్ల బారిన పడి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు నగదు పోగొట్టుకున్న సంఘటన ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగింది. గన్నవరం ఎస్టీబీఎల్ కాలనీలో ఉంటున్న తమ్మలూరి శివకుమారి.. వీరపనేని గూడెం ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు సైబర్ నేరగాళ్లు పలుమార్లు ఫోన్ చేసి.. మాయమాటలు చెప్పారు.

వారి మాటలు నిజమని నమ్మిన శివకుమారి... తన ఫోన్​కు వచ్చిన ఓటీపీని వారికి చెప్పింది. ఇంకేముంది.. క్షణాల్లో ఆమె అకౌంట్ నుంచి రూ. 25 వేలు దోచుకున్నారు. ఖాతా నుంచి నగదు విత్​డ్రా అయినట్లు వచ్చిన మెసేజ్ చూసి ఖంగుతిన్న శివకుమారి... గన్నవరం పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.