ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో వాహన తనిఖీల్లో భారీగా బంగారం, వెండి పట్టుబడింది. తమిళనాడు నుంచి నెల్లూరు ప్రయాణించిన బస్సులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కేజీ బంగారం, 6.50 కేజీల వెండి గుర్తించారు. పట్టుబడిన బంగారం, వెండి.. నెల్లూరుకు చెందిన వ్యాపారిదిగా గుర్తించారు. ధ్రువీకరణ పత్రాలు లేని కారణంగా వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విధానంపై తుది నిర్ణయం...!