ETV Bharat / jagte-raho

ఆ బంగారం ముంబయి, జయపురకు వెళ్తోంది..! - శంషాబాద్​ విమానాశ్రయంలో బంగారం సీజ్​ కేసు

శంషాబాద్‌ ఎయిర్‌ కార్గోలో పట్టుబడిన బంగారం కేసులో అధికారులు పురోగతి సాధించారు. కేసుకు సంబంధించి కొరియర్‌ను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌ అధికారులు లోతుగా ప్రశ్నిస్తున్నారు.

ఎయిర్​ కార్గో బంగారం అక్రమ రవాణా కేసులో పురోగతి

author img

By

Published : Oct 5, 2020, 9:19 PM IST

Updated : Oct 5, 2020, 10:06 PM IST

శంషాబాద్‌ ఎయిర్‌ కార్గోలో పట్టుబడిన ఎనిమిది కిలోల బంగారం, వజ్రాల కేసులో ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ నెల మూడో తేదీ తెల్లవారు జామున రూ.6.62 కోట్లు విలువైన 8 కిలోలు బంగారు ఆభరణాలు, వజ్రాలు, బంగారు బిస్కెట్లను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా ముంబయి, జయపురకు తరలిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేసుకున్న ఎయిర్‌ కార్గో కస్టమ్స్‌ అధికారులు... దర్యాప్తు నిమిత్తం ఆ కేసును హెడ్‌ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు.

ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన పవన్‌ కార్గో కొరియర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ బంగారం హైదరాబాద్‌, విజయవాడకు చెందిన పలు దుకాణదారులదిగా ప్రాథమికంగా గుర్తించారు.

పార్శిల్‌ చేస్తున్న బంగారానికి, వజ్రాలకు కస్టమ్స్‌ డ్యూటీ, జీఎస్టీ చెల్లించకపోవడం వల్ల దానిని అక్రమ బంగారంగా ప్రాథమికంగా తేల్చారు. కొరియర్‌ ద్వారా ఏయే దుకాణాల నుంచి ఎంతెంత ఉందన్న అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగాయా అన్న కోణంలోను దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: శంషాబాద్​ విమానాశ్రయంలో రూ.6.62 కోట్లు విలువైన బంగారం స్వాధీనం

Last Updated : Oct 5, 2020, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.