గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ పలువురి ఆచూకీ లభించలేదు. ప్రస్తుతానికి మొత్తం 19 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలు ఒక్కొక్కటిగా వివిధ ప్రాంతాలకు కొట్టుకువస్తున్నాయి. 14 మంది మృతదేహాలు నీళ్ల పైకి తేలగా, మరో ఐదు మృతదేహాలను సిబ్బంది గుర్తించారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్దకు ఇద్దరి మృతదేహాలు కొట్టుకువచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం కొత్త పట్టిసీమ వద్ద మరొక మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి జేబులో ఉన్న గుర్తింపు కార్డును పరిశీలించిన పోలీసులు..... మృతుడు హైదరాబాద్ మాదాపూర్ వాసి ఇ.సాయికుమార్‌గా గుర్తించారు. ఇప్పటివరకు మొత్తం 27 మృతదేహాలు లభ్యమయ్యాయి.
పోలవరం ఇసుక రేవు, కచ్చులూరు, ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద ఒక్కో మృతదేహాన్ని గుర్తించారు. తాళ్లపూడి వద్ద ఒకటి, ధవళేశ్వరం వద్ద మరొక మృతదేహం లభ్యమైంది. విజ్జేస్వరం లాకుల వద్ద 17వ నంబర్ గేట్లో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది... బోటు ప్రమాద మృతుడిగా అనుమానిస్తున్నారు. మృతుల వివరాలు కనుగొనే పనిలో ఉన్నారు.
315 అడుగుల లోతులో బోటు మునిగినట్లు అధికారులు గుర్తించారు. గల్లంతైనవారి కోసం విస్తృతంగా గాలింపు జరుగుతోంది. బోటు మునిగిన ప్రదేశంలో సుడిగుండాలు, వరద ఉద్ధృతి ఉండడంతో... గాలింపు చర్యలకు ప్రతికూలంగా మారాయి. సహాయక బోట్లు నిలవని పరిస్థితి ఏర్పడింది. పోలవరం వద్ద దొరికిన మృతదేహం నరసాపురానికి చెందిన బి.ఎస్.ఫణికుమార్‌గా గుర్తించారు.
ఇదీ చూడండి: బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం మూడో రోజు గాలింపు