కామారెడ్డి రామారెడ్డి మండలం మునిప్ప తండా శివారులో దారుణం చోటు చేసుకుంది. ముదావత్ జందర్ ముదావత్ మంగ్లీల కూతురు సంధ్య (10) అనే బాలిక అనుమానాస్పద మృతి చెందింది. ఈ ఘటన గ్రామానికి కిలోమీటర్ దూరంలో జరిగింది. బాలికకు మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈనెల 17న ఉదయం ఇంటి నుంచి వెళ్లిన బాలిక... శవమై తేలడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.