మహబూబాబాద్ జిల్లా సాలార్‌తండా సమీపంలో ఎక్సైజ్ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించారు. ఏపీలోని విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి నుంచి డీసీఎం వాహనంలో మహబూబాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల నల్లబెల్లం, 30 కేజీల పటిక, 10 లీటర్ల పోలీసులు పట్టుకున్నారు. వీటితో పాటు వాహన డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఎక్సైజ్ అధికారుల మాటలను పెడచెవిన పెట్టి గుడుంబాను తయారు చేసేందుకు నల్లబెల్లాన్ని అక్రమ మార్గాల్లో తరలిస్తున్నారని మహబూబాబాద్ ఎక్సైజ్ సీఐ రమేష్ చందర్ తెలిపారు. ఈ వాహన తనిఖీల్లో ఒక నిందితుడు పరారీలో ఉన్నారని.. అతన్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు రమేష్ చందర్ తెలిపారు.
ఇదీ చదవండిః గుట్కా కేంద్రంపై దాడి.. వంద బస్తాలు స్వాధీనం