జల్సాలకు అలవాటుపడి ఆటోమొబైల్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను కరీంనగర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముఠా నుంచి 50 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి వెల్లడించారు. వాహనాల విలువ దాదాపు 28 లక్షల పైన ఉంటుందన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆరుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాలో ద్విచక్ర వాహన దొంగతనాలకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. కరీంనగర్ సిటీని సేఫ్ జోన్‌లో ఉంచామని కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు.
సవాల్‌గా తీసుకున్న కరీంనగర్ పోలీసులు ఎట్టకేలకు ముఠాను పట్టుకోవడం సంతృప్తినిచ్చిందని కమలాసన్ రెడ్డి అన్నారు. ముఠా సభ్యులు కిషన్ జైపాల్, మెట్టు శ్రీనివాస్, ధర్మ రాజేశ్వర్, జనార్దన్, నవీన్, రాములును కస్టడీలోకి తీసుకొని మరింత సమాచారం కోసం దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.
ఇదీ చూడండి: కిటికీ చువ్వలు తొలగించి.. బాలుర పరారీ