ETV Bharat / jagte-raho

నకిలీ ఎస్వోటీ పోలీస్ ముఠా అరెస్ట్ - neredmet police arrested fake police gang

మేడ్చల్​ జిల్లా నేరేడ్​మెట్​లో ఎస్వోటీ పోలీసులమంటూ... దోపిడీకి పాల్పడ్డ నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి రూ.19వేల నగదు, ఓ కారు, ఓ ద్విచక్రవాహనం, నాలుగు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

four fake sot police arrested in neredmet

author img

By

Published : Dec 25, 2020, 10:13 PM IST

ఎస్వోటీ పోలీసుల పేరుతో ఓ వ్యక్తిని బెదిరించి దోపిడీకి పాల్పడ్డ నలుగురు సభ్యుల సూడో పోలీసుల ముఠాను మేడ్చల్ జిల్లా నేరేడ్​మెట్ పోలీసులు అరెస్ట్​ చేశారు. యాదాద్రి జిల్లా బొమ్మల రామారానికి చెందిన వర్త్యాల లోకేశ్​ ఓల్డ్​ సఫీల్​గూడాలోని పీబీ కాలనీలో రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల వద్ద నుంచి సేకరించడానికి వచ్చాడు. ఇది గమనించిన ఆర్టీసీ కాలనీకి చెందిన నలుగురు యువకులు... తాము ఎస్వోటీ పోలీసులమని చెప్పి లోకేశ్​ను బెదిరించారు. ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతని వద్ద ఉన్న 19 వేల నగదును దోచుకెళ్లారు.

బాధితుడు లోకేశ్​ జరిగిన మోసాన్ని గుర్తించి.... నేరేడ్​మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు... ఆర్టీసీ కాలనీకి చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 19 వేల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఓ కారు, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని... నిందితులను రిమాండుకు తరలించారు.

ఇదీ చూడండి: దా'రుణ' యాపుల్లో డ్రాగన్​ వ్యక్తులదే కీలక పాత్ర...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.