ETV Bharat / jagte-raho

సైబర్ 'ఛీ'టర్స్: అంతర్జాలమే పెట్టుబడి.. మోసంతోనే రాబడి!

లాటరీ తగిలిందటారు.. బీమా సొమ్ము చెల్లిస్తామంటారు.. విరాళాలు ఇస్తామంటారు... ఇదంతా ప్రేమతోనో, సేవాగుణంతోనో కాదు. మోసం చేయడానికి పక్కా స్కెచ్. ఎక్కడో ఏదో దేశంలో ఉండి... అంతర్జాలమే వేదికగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. విద్య, వ్యాపారం, పర్యాటక వీసాల పేరుతో భారత్​కు వస్తున్న ఆఫ్రికన్లు ఎక్కువగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.

foreigners doing cyber frauds in india
మోసాలే వృత్తిగా చెలరేగుతున్న సైబర్ నేరగాళ్లు
author img

By

Published : Dec 27, 2020, 11:31 AM IST

మీ స్వంచ్ఛంద సంస్థ అందిస్తున్న సేవ మాకు ఎంతగానో నచ్చింది... మీ సంస్థ చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలు పంపిస్తే విరాళం ఇస్తామంటూ వచ్చే ఫోన్​లకు స్పందించారంటే.. అంతే. అమాయకులకు ఎరవేసి నట్టేట ముంచుతున్నారు ఆఫ్రికన్లు. ఉపాధి లేని కారణంగా నైజీరియా, సోమాలియా, కెన్యా, ఉగాండా, ఇథియోఫియాకు చెందినవారు సైబర్ నేరాలనే వృత్తిగా ఎంచుకున్నారు. అక్కడ ఉండే మోసాలకు పాల్పడుతున్న వాళ్లు కొంత మందైతే... విద్య, పర్యాటకం, వ్యాపారం, వైద్య చికిత్స కోసం వీసాలపై వచ్చి మరికొంత మంది మోసాలకు తెగబడుతున్నారు. స్థానికుల సాయంతో సైబర్ మోసాలు చేస్తున్నారు. కంప్యూటర్లు, లాప్​టాప్​లు, చరవాణిలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని... గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింకులు చూడొద్దని సైబర్ క్రైం పోలీసులు, నిపుణులు సూచిస్తున్నారు.

కంపెనీ మెయిల్స్ హ్యాక్

ఇతర దేశాల్లో ఉంటూ సైబర్ మోసాలకు పాల్పడే వాళ్లు ఎక్కువగా పెద్ద పెద్ద కంపెనీలకు చెందిన మెయిళ్లను హ్యాక్ చేస్తున్నారు. కంపెనీ మెయిల్​కు మాల్​వేర్ పంపించి... మొదట మెయిల్ హ్యాక్ చేస్తారు. ఆ తర్వాత ఆ మెయిల్​లో ఉండే... ఇతర కంపెనీల వివరాలన్నీ సేకరిస్తారు. ఉదాహరణకు ఒక కంపెనీ... ఇంకో కంపెనీకి డబ్బులు చెల్లించాల్సి ఉంటే వాటి వివరాలు సేకరిస్తారు. డబ్బులు తీసుకోవాల్సిన కంపెనీ ఈ మెయిల్ ఖాతాలో ఒక మార్పు చేసి... డబ్బు చెల్లించాల్సిన కంపెనీకి సందేశం పంపుతారు. ఇవేమీ గమనించని కంపెనీ ప్రతినిధులు... చెల్లించాల్సిన డబ్బులను సైబర్ నేరగాళ్లు పంపిన ఖాతాలో జమ చేస్తారు. ఒకవేళ మెయిల్ ఖాతా, బ్యాంకు వివరాలు మారిన సంగతిని గుర్తించి అవతలి వ్యక్తిని అడిగినా... ఆ ఖాతాలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిఘా పెట్టినందుకు ఈ ఖాతాలోనే జమ చేయాలని సైబర్ నేరగాళ్లు నమ్మిస్తున్నారు. ఇలా ఎక్కువగా ఇతర దేశాల్లోని సైబర్ నేరగాళ్లు కంపెనీల మెయిళ్లను హ్యాక్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు.

స్థానికుల సాయం..

రెండేళ్ల క్రితం వరకు ఆన్​లైన్ మోసం అనగానే నైజీరియన్ల పనే అయి ఉండొచ్చని దర్యాప్తు సంస్థల అధికారులు ప్రాథమికంగా అనుమానపడే వాళ్లు. ప్రస్తుతం రాజస్థాన్, జార్ఖండ్, నోయిడాకు చెందిన యువకులు కూడా ఆఫ్రికన్ల సాంగత్యంతో సైబర్ నేరాల్లో ఆరితేరారు. ఇతర దేశాల్లో ఉంటూ మోసాలకు పాల్పడినా... దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉంటూ నైజీరియన్లు సైబర్ నేరానికి పాల్పడినా... స్థానికంగా ఉండే వాళ్ల సాయం లేనిదే ముందుకు వెళ్లలేరు. సైబర్ మోసానికి పాల్పడిన తర్వాత ఖాతాదారులతో డబ్బులు జమ చేయించడానికి ఓ ఖాతా అవరసరం ఉంటుంది. దీనికోసం నైజీరియన్లు ఇక్కడ ఉండే వాళ్ల ఖాతాను సేకరిస్తున్నారు. ఖాతా ఇచ్చినందుకు గాను... సదరు వ్యక్తికి నైజీరియన్లు కొంత మొత్తాన్ని చెల్లిసారు.

ఐపీ అడ్రస్ ఆధారంగా..

సైబర్ నేరగాళ్లు ఉపయోగించే మెయిల్ ఐడీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్​ను ఉపయోగించుకొని నేరగాళ్లు ఏ ప్రాంతం నుంచి మోసానికి పాల్పడే విషయాన్ని తెలుసుకొని అక్కడి వెళ్లి నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. దీనికోసం సైబర్ క్రైం పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిచుకుంటున్నారు. ఒకవేళ సైబర్ నేరగాళ్లు ఇతర దేశంలో ఉండి మోసం చేసినట్లు తేలితే... ఇంటర్ పోల్ సాయంతో అరెస్ట్ చేసి దేశానికి రప్పిస్తున్నారు. పలు వీసాల పేరుతో దేశంలోకి వచ్చి సైబర్ మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్లను అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపిస్తున్నారు. ఆ తర్వాత బయటికి రాగానే వారి వారి దేశాలకు డిపోర్ట్ చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఆ యాంటీబాడీలతో కరోనా​ నుంచి తక్షణ రక్షణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.