మేడ్చల్ జిల్లాలోని మూడు వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐదు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. కొంపల్లిలో అశోక్ తన భార్య పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. ఈనెల రెండో తేదీన కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య భాగ్య(30) తన ఇద్దరు పిల్లలు శ్రీచందన్ (12), ధనకుమార్(11)ను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తెలిసిన చోట్లలో అశోక్ వెతకగా... లాభం లేకపోయింది. చేసేదేమీ లేక అశోక్... పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దుండిగల్ పీయస్ పరిధిలోని సురారంలో ఇద్దరు విద్యార్థులు శివ(19),తులసి (18) మూడు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఇద్దరూ కలిసి వెళ్లిపోయారనుకుని విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. వారం క్రితం విద్యార్థిని తులసి ఇంటికి రాగా... శివ మాత్రం రాలేదు. తులసిని తన కొడుకు శివ(19) గురించి ఆచూకీ అడగ్గా.... తనకు తెలియదని సమాదానం ఇచ్చింది. వెంటనే శివ తల్లిదండ్రులు దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
జీడీమెట్ల పరిధి సుభాశ్ నగర్లో ఈనెల 6న భర్త ధీరజ్ ఉద్యోగానికి వెళ్లగా... వచ్చి చూసేసరికి భార్య అంజుదేవి కన్పించలేదు. తెలిసిన అన్ని చోట్ల వెతకగా... ఆచూకీ లేదు. ఇక ధీరజ్ జీడీమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వీటన్నింటినీ మిస్సింగ్ కేసులుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.