మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలోని పూజా సామగ్రి దుకాణంలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణంలో పెద్దఎత్తున మంటలు ఎగసిపడటాన్ని గమనించిన స్థానికులు.. అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని దుకాణం యజమాని తెలిపాడు. భారీ స్థాయిలో ఆస్తినష్టం వాటిల్లిందని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: వైద్యుల నిర్లక్ష్యం: బస్టాండ్లో మృతి చెందిన మహిళ