హైదరాబాద్ కార్వాన్ ఆర్య సమాజ్ బస్తీలో నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఓ ఇంటి పెంట్ హౌస్లో నిల్వ ఉంచిన బాణసంచా ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు బకెట్లతో నీళ్లు పోసి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు.
ఆ ఇంటి యజమాని గత ఏడాది బాణసంచా దుకాణం పెట్టి... మిగిలినవి పైన ఉన్న ఖాళీ గదిలో నిల్వ చేశారని స్థానికులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందని తెలియాల్సి ఉంది. దీని గురించి పోలీసులకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.
ఇదీ చదవండి: రిజిస్ట్రేషన్లు సంబంధిత అంశాలపై నేడు సీఎం సమీక్ష