కన్న కూతురిపైనే... తండ్రి అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన ఘటన విశాఖలో జరిగింది. బాలిక అస్వస్థతకు గురికావటం వల్ల కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. ఆమె గర్భం దాల్చిందని గుర్తించారు.
విశాఖ రైల్వేన్యూకాలనీలో బాధిత బాలిక, తండ్రి, నానమ్మ, తాతయ్య కలిసి ఉంటున్నారు. బాధితురాలి తల్లి ఇటీవలే చనిపోయింది. ఫలితంగా గత అయిదు నెలలుగా బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ తండ్రి. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితునిపై నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.