ETV Bharat / jagte-raho

కన్న కూతురిపై తండ్రి అత్యాచారయత్నం - మేడ్చల్​ జిల్లా తాజా వార్తలు

కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాటేయ్యాలని చూశాడు. నడక నేర్పించినవాడే నరకం చూపిద్దామనుకున్నాడు. మల్కాజిగిరిలో ఓ తండ్రి కన్నకూతురని లైంగికంగా వేధించాడు. తన కోరిక తీర్చమని అత్యాచారానికి యత్నించాడు. ఇంటికి వచ్చిన తల్లి.. ఏడుస్తున్న కూతురిని అడగ్గా అసలు విషయం చెప్పింది.

కన్న కూతురిపై తండ్రి అత్యాచారయత్నం
కన్న కూతురిపై తండ్రి అత్యాచారయత్నం
author img

By

Published : Oct 8, 2020, 11:51 PM IST

మేడ్చల్​ జిల్లా మల్కాజిగిరిలో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురిని లైంగికంగా వేదించిన తండ్రి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలోని ఒక కాలనీలో వాచ్​మేన్​గా పని చేస్తున్న ఓ వ్యక్తి కన్న కూతురిపై అత్యాచారాయత్నానికి పాల్పడ్డాడు. నిందితుని భార్య పని నిమిత్తం బయటకు వెళ్లి వచ్చేసరికి కుమార్తె ఏడుస్తూ కనిపించింది.

ఏమైందని కూతురిని అడగ్గా.. ఆమె చెప్పిన సమాధానం విని ఆ తల్లి దిగ్భ్రాంతికి లోనైంది. పూర్తిగా వివరాలు తెలుసుకొని, తన భర్త కన్నకూతురిని లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి: కన్న కూతురిపై 3 నెలలుగా తండ్రి అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.