సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఫేస్బుక్ ఖాతాను ఎవరో గుర్తు తెలియని సైబర్ నేరస్థులు హాక్ చేసినట్టు ఎస్సై శ్రీధర్ తెలిపారు. పీఎస్ పేరుతో డూప్లికేట్ పేజీ తయారు చేసి.. ఎస్సై శ్రీధర్ ఫొటో పెట్టారు.
డబ్బులు అవసరం ఉన్నాయి, పంపించాలంటూ.. అదే ఖాతా నుంచి సందేశాలు పంపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రజలు, స్నేహితులు ఎవరు కూడా ఆ ఫేస్బుక్ ఖాతా నుంచి వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని, డబ్బులు పంపి మోసపోవద్దని సూచించారు.
ఇదీ చూడండి: ఎనిమిదేళ్ల బాలుడిపై... ముగ్గురు బాలురు అసహజ లైంగిక దాడి?!