హైదరాబాద్ నగర శివార్లలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా రామ్‌నగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగులు నాగేంద్ర ప్రసాద్, బి. గౌతమ్, రాంమందిర్కు చెందిన డ్రైవర్ నరేశ్‌లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. కష్టం లేకుండానే భారీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ నోట్లు తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు కలర్ ప్రింటర్, స్కానర్‌ను కొనుగోలు చేశారు.
యంత్రాలతో ఒరిజినల్ నోటను జీరాక్స్ తీసి... రూ. 100 నోట్ల కట్టలు తయారు చేశారు. అందులో పది ఒరిజినల్ నోట్లు ఉంటాయి. వీటిని రద్దీగా ఉన్న ప్రాంతాల్లో చిరు వ్యాపారుల వద్ద ఏజెంట్ల ద్వారా చలామణి చేస్తున్నారు. అందులో భాగంగా... ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏజెంట్లకు ఇచ్చేందుకు వచ్చారు. ఈ సమాచారంతో మల్కాజిగిరి ఎస్వోటీ బృందానికి తెలిసింది. ఘట్కేసర్ పోలీసుల సాయంతో ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.10 లక్షల నకిలీ నోట్లు, యంత్రాలు, చరవాణీలు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ చంద్రబాబు తెలిపారు.
ఇదీ చదవండి: 'అధ్యాపకులు లేక వైద్య సీట్లు కోల్పోయే పరిస్థితి ఉండకూడదు'