ETV Bharat / jagte-raho

'అనిశా డీఎస్పీని మాట్లాడుతున్నా... ఖర్చులకు డబ్బులు పంపండి'

author img

By

Published : Oct 8, 2020, 4:25 PM IST

అవినీతి నిరోధక శాఖ డీఎస్పీనంటూ ఏకంగా ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శికే ఫోన్ చేసి బురిడీ కొట్టించాలనుకున్నాడు ఓ వ్యక్తి. ఎమ్మెల్యే పీఏ అప్రమత్తతతో వ్యవహరించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఆ నకిలీ డీఎస్పీని పట్టుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

fake-acb-officer-arrest-in-chittoor
'నేను అనిశా డీఎస్పీని మాట్లాడుతున్నా... ఖర్చులకు డబ్బులు పంపండి'

అవినీతి నిరోధక శాఖ డీఎస్పీనంటూ ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు వ్యక్తిగత కార్యదర్శికి ఫోన్ చేసి ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనను హరికృష్ణగా పరిచయం చేసుకుని... ఎమ్మెల్యే పీఏకు ఫోన్ చేశాడు. చిత్తూరులో వీఐపీల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నామని తెలిపాడు. తమ బృందం దాడులు చేస్తూ చిత్తూరులోని ఒక లాడ్జిలో ఉన్నామని... తమ దగ్గర ఏటీఎం కార్డులు మాత్రమే ఉన్నాయని ఖర్చులకు డబ్బు పంపమని... తన గూగుల్ పే నెంబర్ తెలిపాడు.

దీనిపై అనుమానం వచ్చిన ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు గూగుల్ పే నంబర్ ఆధారంగా నగరంలోని లాడ్జిలో ఉన్న నకిలీ ఏసీబీ అధికారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పలు విషయాలు తెలిసినట్లు సమాచారం.

హరికృష్ణ ఆంధ్రప్రదేశ్​లోని ప్రముఖ రాజకీయ నాయకుల ఆస్తుల వివరాలు సేకరించినట్లు తెలిసింది. దీని వెనుక పెద్ద నెట్​వర్క్ ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి.. ఆఖరి రోజు కస్టడీకి ఏసీపీ నర్సింహారెడ్డి.. ఏసీబీ ప్రత్యేక దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.