ETV Bharat / jagte-raho

స్కూళ్లు కావవి.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలు!

author img

By

Published : Jan 12, 2021, 10:39 AM IST

కరోనా కారణంగా మూతపడ్డ విద్యాసంస్థలు మందుబాబులకు అడ్డాలుగా తయారయ్యాయి. ఆకతాయిలు పార్క్​లు, బహిరంగ ప్రదేశాల్నే కాదు.. పాఠశాలల్ని కూడా వదలడం లేదు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ స్కూళ్లో మందుబాబులు ఇలాగే నిత్యం మద్యం సేవిస్తూ నానా విధ్వంసం సృష్టిస్తున్నారు.

స్కూళ్లు కావవి.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలు!
Educational institutions that were closed due to the corona became barriers to unethical activities

కామారెడ్డి జిల్లా కేంద్రం అశోక్​నగర్​లోని ఓ మూసి ఉన్న పాఠశాలలో మందుబాబులు హల్​చల్ చేశారు. స్కూల్​ గ్రౌండ్​లో.. కర్రలు, రాళ్లతో కొట్టుకుంటూ విధ్వంసం సృష్టించారు. ఇది చూసిన కాలనీ వాసులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఆ మేరకు పోలీసులకు సమాచారమిచ్చారు.

ఏం జరిగిందంటే?

స్థానిక వాసవి పాఠశాల ఆకతాయిలకు అడ్డాగా మారింది. కొవిడ్​ నేపథ్యంలో మూతపడిన ఈ పాఠశాల మైదానంలో మందుబాబులు నిత్యం మద్యం సేవిస్తూ హల్​చల్ చేస్తున్నారు.

రోజు మాదిరిగానే ఒకచోట చేరిన ఆకతాయిలు.. డబ్బుల విషయంలో గొడవ పడ్డట్లు తెలుస్తోంది. ఇరు వర్గాలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. దాంతో ఒక్కసారిగా అక్కడ ఘర్షణ వాతవరణం ఏర్పడింది. భయబ్రాంతులకు గురైన స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పాఠశాల ఆవరణలో మందుబాబుల వీరంగం

పోలీసులు ఘటన స్థలానికి చేరుకొనేలోపే ఆకతాయిలు అక్కడినుంచి పరారయ్యారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విఙప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో విద్యా సంస్థల ప్రారంభంపై నేడు స్పష్టత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.