సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల వ్యవధిలోనే 3500 మందికి పైగా మందుబాబులపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపిన 3571 మందిపై కేసులు నమోదు చేసి వాళ్ల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గత నెల 27వ తేదీ నుంచి ఈ నెల 4 ఉదయం వరకు పోలీసులు పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు.
అత్యధికంగా మాదాపూర్, గచ్చిబౌలి
ఈ నేపథ్యంలో డిసెంబర్ 31వ తేదీ ఒక్క రోజే 931 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మాదాపూర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 714 కేసులు, గచ్చిబౌలిలో 709.. అత్యల్పంగా బాలాపూర్లో 173 కేసులను పోలీసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతుండటం వల్ల ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటుండటంతో.. వీటిని నివారించేందుకు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు పక్కాగా తనిఖీలు చేపడుతున్నారు.
ఇదీ చదవండి: ట్రాలీఆటో బోల్తా... 18 మందికి గాయాలు