పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ జ్యోతినగర్‌లో పిచ్చి కుక్క దాడిలో ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. మేడిపల్లి కూడలిలో రహదారిలో పలువురిపై దాడికి పాల్పడింది. పిచ్చికుక్క స్వైరవిహారంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
పలువురు చిన్నారులను కాళ్ళు, చేతులపై పిచ్చికుక్క కరవడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 కు సమాచారం అందించగా గాయపడినవారిని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గోదావరిఖని సమీపంలోని జనగామలో కోతులు దాడి చేయడంతో ఒకరు గాయపడ్డారు.