ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని 'డయల్ 100' పోలీసులు కాపాడారు. అత్యంత వేగంగా స్పందించి ప్రాణాలు కాపాడిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఈ ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగింది.
వన్‌టౌన్ సిబ్బంది సీహెచ్ సత్యనారాయణ, సురేశ్ విధి నిర్వహణలో భాగంగా మంగళవారం రాత్రి సాగర్ రోడ్డులో ఉన్నారు. ఇంతలో వారికి 'డయల్ 100' నుంచి ఓ ఫోన్ వచ్చింది. 'ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. వచ్చి కాపాడండి' అని ఫోన్ కాల్ సారాంశం. వెంటనే స్పందించిన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. ఆ వ్యక్తిని కాపాడారు.
సమాచారం ఇచ్చిన వ్యక్తి మునుగోడు రోడ్డులో ఉన్నట్లుగా మాత్రమే చెప్పాడు. ఆ తర్వాత కాల్ చేయగా స్పందించలేదు. అయినా కేవలం నాలుగు నిమిషాల్లో వ్యవధిలో అక్కడికి చేరుకున్నారు. ఉరి వేసుకున్న వ్యక్తి స్పృహ తప్పగా.. ప్రథమ చికిత్స చేసి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అతని సమస్యను తెలుసుకుని మనోధైర్యం చెప్పారు.
ఇదీ చూడండి: యువకుడిపై మూకదాడి.. 12 మందిపై కేసు