ETV Bharat / jagte-raho

దారుణం: తమ్ముని కూతురిని అత్యాచారం చేసిన దంతవైద్యుడు - పే

కంచే చేను మేసింది అన్న మాట ఇక్కడ నిజమైంది. వావి వరసలను కాలరాసి... నమ్మకమనే మాటను నాలుగుగోడల మధ్య పాతేశాడు. భద్రంగా ఉంటుందని ఇంట్లో ఉంచి చదివిస్తే... తమ్ముని కూతురనే ఇంగితం కూడా లేకుండా... కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ పెద్దనాన్నే పశువయ్యాడు. బెదిరించి మరీ కామవాంఛ తీర్చుకున్నాడు.

దారుణం: తమ్ముని కూతురిని అత్యాచారం చేసిన దంతవైద్యుడు

author img

By

Published : Sep 6, 2020, 10:48 PM IST

మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పరిధిలో జరిగిన ఓ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చదువు నిమిత్తం హైదరాబాద్​ నగరానికి వచ్చిన ఓ అమ్మాయి(20) తన పెదనాన్న వద్ద ఉంటోంది. వృతిరీత్యా దంత వైద్యుడైన వినోద్ కుమార్ తనను బెదిరించి‌ గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు సుమారు ఇరవై సార్లు తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది.

వావి వరసలు మరిచి తనను అత్యాచారం చేసిన కామాంధుని బండారం బయటపెట్టేందుకు ధైర్యం చేసిన బాధితురాలు షీ టీంను ఆశ్రయించింది. వారి సహకారంతో పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.