ETV Bharat / jagte-raho

గల్లంతైన రెండో వ్యక్తి మృతదేహం లభ్యం - latest crime news rangareddy district

ఇద్దరు వ్యక్తులు కారుతో సహా వాగులో కొట్టుకెళ్లిన ఘటనలో రెండో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ లష్కర్​గూడ వద్ద మంగళవారం రాత్రి వాగు ప్రవాహ ఉద్ధృతికి వెంకటేశ్​ గౌడ్​, రాఘవేంద్ర అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

deadbody find in water in rangareddy district
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
author img

By

Published : Oct 15, 2020, 10:26 AM IST

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ లష్కర్​గూడ వద్ద మంగళవారం రాత్రి వాగు ప్రవాహ ఉద్ధృతికి కారుతో సహా వెంకటేశ్​ గౌడ్​, రాఘవేంద్ర అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారిలో బుధవారం మధ్యాహ్నం వెంకటేశ్​ గౌడ్​ మృతదేహం లభ్యం కాగా.. గురువారం ఉదయం రాఘవేంద్ర మృతదేహం దొరికింది.

రాఘవేంద్ర మృతదేహం సాగర్​పంప్ ప్రాంతంలోని వంతెన వద్ద గుర్తించిన పోలీసులు.. వెలికి తీశారు. వెంకటేశ్ గౌడ్​ స్వస్థలం​ కందూరు మండలం బేగంపేట కాగా.. రాఘవేంద్ర కందుకూరు మండలం బాచుపల్లికి చెందిన వ్యక్తి. వీరిద్దరు చెరువుగట్టు బయల్దేరి లష్కర్​ గూడా వద్ద వాగులో గల్లంతయ్యారు.

ఇదీ చదవండి: చెరువు కత్వాలో పడి బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.