ETV Bharat / jagte-raho

వెనకనుంచి కారును ఢీకొట్టిన డీసీఎం.. ఒకరికి తీవ్ర గాయాలు - accident at jadcherla in mahabubnagar district

జాతీయ రహదారిపై కారును వెనకనుంచి ఢీకొట్టగా.. కారు బోల్తా పడిన ఘటన మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల సమీపంలోని మల్లబోయినపల్లి వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

DCM hits lorry from back side accident at jadcherla in mahabubnagar district
జడ్చర్లలో వెనకనుంచి కారును ఢీకొట్టిన డీసీఎం
author img

By

Published : Sep 3, 2020, 3:17 PM IST

కర్నూల్​ నుంచి హైదరాబాద్​కు వెళ్తున్న కారును మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల సమీపంలోని మల్లబోయినపల్లి వద్ద వెనక నుంచి డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు బోల్తా పడి అందులో ఉన్న నవీన్ (28) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతణ్ని కారులో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్​కు కాసేపు అంతరాయం కలిగింది. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించారు. గాయపడిన నవీన్ ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా ఆత్మకూర్​ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. డీసీఎం వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు ఎస్సై సంసుద్దీన్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.