హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి తల్లిదండ్రులతో కలిసి నివాసముంటుంది. సికింద్రాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఆమె ఇంటి దగ్గరలో ఉంటున్న... జోసఫ్, నవీన్ రెడ్డి, రాములు... సదరు విద్యార్థినితో స్నేహంగా మెలిగేవారు.
ఈనెల 5వ తేదీన టర్మ్ ఫీజు చెల్లించేందుకు విద్యార్థిని కళాశాలకు వెళ్లింది. ఆ సమయంలో జోసెఫ్ ఫోన్ చేసి... తన పుట్టినరోజు వేడుక చేసుకుందాము అంటూ పిలిచాడు. స్నేహితులపై నమ్మకంతో యువతి వారి వెంట వెళ్లింది. కేపీహెచ్‌బీ సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లిన నిందితులు... ఆమెతో మత్తుమందు కలిపిన కేక్ తినిపించారు.
అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. అయితే... బాధిత యువతి అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలవ్వడంతో అత్యాచారం విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో... ఎస్సీ, ఎస్టీ, అత్యాచార నిరోధక చట్టం కింద హైదరాబాద్ పోలీసుల కేసు నమోదు చేశారు. ఘటన సైబరాబాద్ పరిధిలో జరగటంతో సైబరాబాద్‌కు బదిలీచేశారు.
ఇదీ చూడండి: యజమాని కుమారుడి చేతిలో కిరాతకానికి గురైన బాలిక మృతి