ETV Bharat / jagte-raho

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలు.. ముఠాసభ్యులకు బేడీలు - సైబరాబాద్ పోలీసుల వార్తలు

పెద్ద సంస్థలో ఉద్యోగం, ఆకర్షణీయ జీతం అంటూ... నిరుద్యోగులకు వలవేస్తూ మోసాలకు పాల్పడుతున్న రెండు వేర్వేరు ముఠాలను సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. లఖ్‌నవూకు చెందిన ముఠాతో పాటు, హైదరాబాద్‌లో రూ.2 కోట్ల వరకు మోసాలకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సంప్రదించేవారికి డబ్బులు చెల్లించి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

sajjanar
sajjanar
author img

By

Published : Sep 18, 2020, 5:46 PM IST

ఎంఎన్​సీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లఖ్‌నవూ కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన షానూ అన్సారీ... మరో ఇద్దరితో కలిసి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 'కెరియర్‌ సైట్‌' అనే ఓ సంస్థను ముంబయి కేంద్రంగా స్థాపించి నిరుద్యోగులకు వలవేస్తూ మోసాలు చేస్తున్నారని సైబరాబాద్ సీపీ సజ్జనార్​ వివరించారు.

ఉద్యోగం అని రూ.38 లక్షలు వసూలు చేశారు

హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు పెద్ద సంస్థలో ఉద్యోగమంటూ వివిధ దశల్లో రూ.38 లక్షలు వసూలు చేశారు. ఎంతకూ ఉద్యోగం రాకపోవడంతో మహిళ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ముంబయి, లఖ్‌నవూకు వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. ఉద్యోగాల కోసం వివిధ వెబ్‌సైట్లలో వివరాలు నమోదు చేసుకున్నవారే లక్ష్యంగా ఈ ముఠా మోసాలు చేస్తోందని సీపీ తెలిపారు.

70 మంది నుంచి రూ.2కోట్లు

విప్రో సంస్థలో ఉద్యోగాలంటూ మోసాలకు పాల్పడిన మరో నిందితుడినీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.15 లక్షలు, 73 నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన గుణ చంద్రశేఖర్‌ అనే నిందితుడు... సుమారు 70 మంది నుంచి రూ.2కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో వివిధ కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో ఓ కన్సల్టెన్సీ స్థాపించి నిరుద్యోగులకు వల వేసేవాడని సీపీ సజ్జనార్​ పేర్కొన్నారు. విప్రో సంస్థకు చెందిన అధికారిక మెయిల్స్‌ని వారికి తెలియకుండానే వాడుకుని మోసాలకు పాల్పడినట్లు తెలిపారు.

ఇలాంటివి నమ్మొద్దు

ఏ ఎంఎన్​సీ కంపెనీ కూడా ఉద్యోగాలకు డబ్బులు తీసుకోదని సీపీ తెలిపారు. ఉద్యోగాల పేరిట సంప్రదించేవారిని నమ్మొద్దని.. డబ్బులు చెల్లించమని అడిగితే వెంటనే తమను సంప్రదించాలని సూచించారు. నిందితులను పట్టుకున్న పోలీసులను సీపీ అభినందించారు.

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలు చేసిన ముఠా అరెస్టు

ఇదీ చదవండి : ఇళ్ల లిస్ట్​ ఇస్తాం... మీరే తిరిగి చూసుకోండి : తలసాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.