ETV Bharat / jagte-raho

మరో మోసం: హైదరాబాద్​లో ఓ కంపెనీ పేరుతో రూ.156 కోట్లు కాజేశారు - సీపీ సజ్జనార్ మీడియా సమావేసం

స్వధాత్రి ఇన్​ఫ్రా సహా వివిధ కంపెనీల పేరుతో ప్రజలను మోసం చేసిన ముగ్గురిని సైబరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే... తమకు సమాచారం అందించాలని సీపీ సజ్జనార్ కోరారు.

cyberabad-cp-sajjanar-announced-swadathri-infra-accuses
స్థిరాస్తి, అధిక వడ్డీ పేరుతో మోసాలు.. నిందితుల అరెస్టు
author img

By

Published : Jul 4, 2020, 6:25 PM IST

స్థిరాస్తి, అధిక వడ్డీ పేరుతో మోసాలు.. నిందితుల అరెస్టు

వివిధ స్కీంల పేరుతో 1,450 మంది నుంచి రూ. 156 కోట్లు వసూలు చేసి మోసాలకు పాల్పడిన ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సీపీ సజ్జనార్​ వివరాలు వెల్లడించారు. కంపెనీ నిర్వాహకుడు యార్లగడ్డ రఘుతోపాటు డైరెక్టర్ శ్రీనివాస్, సహాకరించిన మినాక్షి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. స్వధాత్రి ఇన్​ఫ్రా ప్రైవేటు లిమిటెడ్​ పేరుతో మాదాపూర్​లో ఓ సంస్థను స్థాపించి... ఏజెంట్లు, టెలికాలర్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షించి, వివిధ స్కీంల పేరుతో పెట్టుబడులు పెట్టించారు.

పెట్టుబడులు తిరిగి చెల్లించడంలో ముఖం చాటేశారు. ఈ క్రమంలో ఓ బాధితుడు మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, అధిక వడ్డీ పేరుతో వినియోగదారులను మోసం చేసినట్టు దర్యాప్తులో తేలింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. రఘు నుంచి రూ. 6 లక్షల నగదు, పార్చ్యూనర్​ వాహనాన్ని సీజ్​ చేసినట్టు సీపీ సజ్జనార్ తెలిపారు.

ఇదీ చూడండి: మిర్యాలగూడలో రామ్‌గోపాల్‌ వర్మపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.