రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కేవైసీ అప్డేట్ పేరుతో ఓ యువతి వద్దనుంచి సైబర్ నేరగాళ్లు రూ. 79 వేలు టోకరా వేశారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌కు చెందిన నిఖితకు ఓ ఫోన్ వచ్చింది. తాము కొటక్ మహేంద్ర బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామంటూ సైబర్ నేరగాళ్లు నమ్మించారు. కేవైసీ అప్డేట్ చేయాలంటూ ఖాతా వివరాలు తీసుకుని రూ. 79 వేలు కాజేశారు.
మరో ఘటనలో హైదరాబాద్ సైదాబాద్‌కు చెందిన అఖిలాష్ ఓఎల్ఎక్స్ ద్వారా బైక్ కొనేందుకు ప్రయత్నించి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి రూ. 41 వేలు పోగొట్టుకున్నారు. ఇద్దరు బాధితులు వేర్వేరుగా సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు ఆన్లైన్లో కొనుగోళ్లు జరిపినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సీసీఎస్ పోలీసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: లేహ్ నుంచి దిల్లీకి ఆకాశమార్గాన అమృత ధారలు