జియో కస్టమర్ కేర్ పేరుతో కొత్త రకం మోసానికి తెరతీశారు సైబర్ నేరగాళ్లు. సిమ్ బ్లాక్ అవుతుందంటూ రిమోట్ యాక్సెస్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవాలని చెప్పి జియో కస్టమర్ ఖాతాలోని డబ్బును మాయం చేశారు.
ఇప్పటి వరకు ఇద్దరు మహిళల నుంచి రూ.2.7 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు తమ డబ్బు తమకు ఇప్పించాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. జియో కస్టమర్లు సైబర్ మోసగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- ఇదీ చూడండి : మహానగరం రక్తసిక్తం.. ప్రమాదాలకు నిర్లక్ష్యమే కారణం