ETV Bharat / jagte-raho

సైబర్​ మోసం​.. 60 లక్షలు స్వాహా - hyderabad latest news

రాష్ట్రంలో సైబర్​ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్​లోని ట్రైక్యాడ్ డిజైన్ కంపెనీ రూ. 60 లక్షలు పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించింది.

సైబర్​ క్రైమ్​.. 60 లక్షలు స్వాహా
సైబర్​ క్రైమ్​.. 60 లక్షలు స్వాహా
author img

By

Published : Aug 30, 2020, 6:24 PM IST

హైదరాబాద్​లోని ట్రైక్యాడ్ డిజైన్ కంపెనీకి అమెరికాలోని ఓ సంస్థతో వ్యాపార సంబంధాలున్నాయి. చైనాలో ఓ కంపెనీకి తమకు కావాల్సిన వస్తువుల ఆర్డర్ పెట్టండని, అందుకయ్యే మొత్తం మీరు చెల్లిస్తే... మిగితాది మనం చూసుకుందాం అంటూ యూఎస్ సంస్థ నుంచి ఈ-మెయిల్ వచ్చింది. ట్రైక్యాడ్ నిర్వాహకులు ఈ-మెయిల్​లో చైనా కంపెనీని సంప్రదించారు.

ఆర్డర్ కోసం 60 లక్షలు బదిలీ చేయాలని చైనా సంస్థ తమ బ్యాంకు ఖాతా నంబరుతో మెయిల్ పంపింది. ఆ ఖాతాకు ట్రైక్యాడ్ ఆ మొత్తం బదిలీ చేసింది. మరో 50 లక్షలు పంపాలని కోరటంతో అనుమానమొచ్చిన ట్రైక్యాడ్ యూఎస్ సంస్థను సంప్రదించింది. తాము అలాంటి మెయిల్ పంపించలేదని చెప్పడం వల్ల మోసపోయినట్లు గ్రహించిన ట్రైక్యాడ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దీన్ని నైజీరియన్ మోసంగా గుర్తించారు. ట్రైక్యాడ్ మెయిల్స్ హ్యాక్ అయ్యాయని తెలిపింది.

ఇదీ చదవండి: పెంపుడు జంతువుల కోసం మొబైల్ సెలూన్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.