మహిళకు గిఫ్ట్ వచ్చిందని ఫోన్ చేశారు. వాటిని ఆమె ఖాతాలో జమ చేయాలి అంటే టాక్స్ చెల్లించాలని నమ్మబలికారు. జీఎస్టీ, ఇన్కం టాక్స్, సేల్స్ టాక్స్, కస్టమ్స్ టాక్స్ పేర్లతో ఆన్ లైన్ ద్వారా రూ.16 లక్షలు తమ ఖాతాలో వేయించుకున్నారు సైబర్ మోసగాళ్ళు. చివరకు తాను మోసపోయానని గ్రహించిన రాం నగర్ కు చెందిన బాధిత మహిళ... వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
మరో ముగ్గురు
కేవైసీ, ఉద్యోగం, లాటరీ, లోన్ పేర్లతో మరో ముగ్గురికి మోసగాళ్లు టోపీ పెట్టారు. రూ.18 లక్షలు ఆన్ లైన్లో డ్రా చేసుకున్నారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: భువనగిరి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం