బెట్టింగ్ వ్యసనానికి బానిస కావొద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. బెట్టింగ్‌ల వల్ల బుకీలే లాభపడతారని పేర్కొన్నారు. పేట్ బషీరాబాద్ ఠాణా పరిధిలోని ఓంకార్ ఆప్టికల్స్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.22లక్షలకు పైగా నగదు, 8 చరవాణిలు స్వాధీనం చేసుకొన్నారు. వారి బ్యాంకు ఖాతాలోని రూ.13లక్షల నగదును జప్తు చేశారు. పరారీలో ఉన్న మరో 9మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.
గత 20 రోజులుగా బెట్టింగ్‌పై ప్రత్యేక నిఘా ఉంచామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రూ.40లక్షలకు పైగా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా పెట్టి.. బెట్టింగుల వైపు వెళ్లకుండా చూడాలని సజ్జనార్ సూచించారు.
ఇదీ చూడండి: ఎస్బీఐ ఏటీఎం చోరీ.. 15 లక్షలు అపహరణ