రంగారెడ్డి జిల్లాలోని యాప్రాల్‌లో తల్లీ, కూతురు ఉండేవారు. తన ఇంటిపక్కనే ఉన్న ఆటో డ్రైవర్ మహేష్ మూడేళ్ల నుంచి తరచుగా అమ్మాయికి ఫోన్ చేసేవాడు. ఆ యువతి సికింద్రాబాద్ పాలికా బజార్‌లోని ఓ దుకాణంలో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోంది. రోజూ ఉదయం షాపునకు వెళ్లి రాత్రి తిరిగి వస్తుండేది.
జులైలో మహేష్ ఆమె షాపు దగ్గరికి వచ్చాడు. అమెను జూపార్క్‌కు తీసుకువెళ్తానని చెప్పి ఎల్బీనగర్ వైపు తీసుకెళ్లాడు. సాయంత్రం 7 గంటల సమయంలో ఆమెను నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆమెను సికింద్రాబాద్‌లోని పెట్రోల్ బంక్ వద్ద దింపేశాడు. ఇంటికి వెళ్లిన యువతి.. తల్లికి అసలు విషయం చెప్పింది. దీనిపై తల్లి గురువారం మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని సికింద్రాబాద్ భరోసా సెంటర్‌కు పంపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇవీ చూడండి: యజమాని కుమారుడి చేతిలో కిరాతకానికి గురైన బాలిక మృతి