కామారెడ్డి జిల్లాలో మరో అధికారి అక్రమాలకు పాల్పడి దొరికిపోయాడు. జిల్లాలోని రాజంపేట మండల తహసీల్దార్ కె.మోతి సింగ్‌ను జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు పాలనాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
రాజంపేట మండలం షేర్ శంకర్ తండాలోని భూములను ఐదుగురికి నిబంధనలకు విరుద్ధంగా పట్టా పాస్ పుస్తకాలు అందించాడు. సమాచారం తెలుసుకున్న జిల్లా పాలనాధికారి తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు.
ఇదీ చూడండి : అగ్ని ప్రమాదం.. 3 లక్షల ఆస్తినష్టం