సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో కామ వాంఛ తీర్చాలంటూ మగ వారిని వంచించే ఒక మహిళను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. కంగ్టి మండలం సాదు తండాకు చెందిన మహిళ (30) ప్రస్తుతం నారాయణఖేడ్ లోని మంగల్‌పేట్‌లో నివాసముంటుంది. పురుషులను లైంగిక అవసరం పేరుతో ఆమె గదికి పిలిచి బంధించి... కేసుల పేరుతో భయపెట్టి డబ్బులు దండుకోవడం చేసేదని ఎస్ఐ తెలిపారు.
కంగ్టి మండలంలోని ముకుంద నాయక్ తండా, ఆకలై తండాకు చెందిన ఏడుగురు ఈనెల 21న నారాయణఖేడ్‌కు పని నిమిత్తం వచ్చారు. ఆమెకు పరిచయం ఉండటం వల్ల భోజనం పేరుతో ఇంటికి పిలిచి వారిని ఇంట్లోనే బంధించింది. కోరిక తీర్చమని బలవంత పెట్టింది. తర్వాత వారి సెల్ ఫోన్లు తీసుకుని ఇంటి బయట నుంచి గడియ పెట్టి వెళ్లిపోయింది.
కొద్ది సేపటికి వచ్చి రూ.40,000/- ఇవ్వమని డిమాండ్ చేసింది. ఇవ్వకుంటే అత్యాచారం చేసారని కేసు పెడ్త అని బెదిరించింది. రూ.30,000లు తీసుకుని వారి ఆధార్ కార్డ్, సెల్ఫోన్లను ఆమె వద్దే పెట్టుకుంది. చివరకు ఆమె చెర నుంచి బయట పడిన వారు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని... దర్యాప్తు చేసి ఆమెను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. నిందితురాలి నుంచి రూ.30,000 నగదు, ఏడు సెల్ ఫోన్లు, ఆధార్ కార్డ్‌లను స్వాధీనం చేసుకుని... రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.