భాగ్యనగ్లోని మోజంజాహి మార్కెట్లో హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసు తనిఖీలు నిర్వహించారు. గుల్నార్ పెర్ఫ్యూమ్ స్టోర్‌లో నిషేధిత ఈ సిగరెట్ నికోటిన్ విక్రయిస్తున్న సయీద్ నూర్‌ను అరెస్ట్ చేశారు. నిందుతుని నుంచి రూ. 2 లక్షల విలువ చేసే జామ్స్ నికోటిన్ ఈ సిగరెట్స్‌తో పాటు పలు రకాల హుక్కా ఫ్లవర్స్ స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం అతన్ని అబిడ్స్ పోలీసులకు అప్పగించినట్లు సెంట్రల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: తెలంగాణలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ