మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రం సమీపంలో గుట్టుగా పేకాట ఆడుతున్న స్థావరంపై ప్రత్యేక పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీసు బృందం స్థానిక ఎస్ఐ భగవంత రెడ్డితో కలిసి ఆదివారం సాయంత్రం దాడి నిర్వహించింది.
రూ.41 వేల 600 స్వాధీనం..
స్థానికంగా 11 ద్విచక్ర వాహనాలు, రూ.41,600 నగదు లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.