ETV Bharat / jagte-raho

ట్రాన్స్​ ఫార్మర్​ను ఢీకొట్టిన కారు... ఒకరు మృతి

author img

By

Published : Oct 20, 2020, 7:37 PM IST

ఓ కారు అదుపు తప్పి... బైక్​తో పాటు ట్రాన్స్​ఫార్మర్​ను ఢీకొన్న ఘటనలో... ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని పెంబట్ల వద్ద చోటుచేసుకుంది.

car-hits-bike-and-transformer-at-sarangapur-in-jagtial-district-and-one-person-dead
ట్రాన్స్​ఫార్మర్​ను ఢీకొట్టిన కారు... ఒకరు మృతి

జగిత్యాల జిల్లాలోని సారంగపూర్​ మండలం పెంబట్ల వద్ద కారు ట్రాన్స్​ఫార్మర్​ను ఢీకొట్టింది. జగిత్యాల వైపు వస్తున్న కారు... ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి... మరో ద్విచక్రవాహనంతో పాటు ట్రాన్స్​ఫార్మర్​ను ఢీకొట్టింది.

ఈ ఘటనలో బైక్​పైన వస్తున్న మీసాల జలందర్​... కారుకి, ట్రాన్స్​ఫార్మర్​కి మధ్యలో ఇరుక్కుని మరణించాడు. బెలూన్​లు తెరుచుకోవడంతో... కారులో వస్తున్న ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన వాటర్​ ట్యాంకర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.