జనగామ జిల్లా సింగరాజుపల్లి సమీపంలో ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ను తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి దేవాదుల కాల్వలోకి దూసుకెళ్లింది.
హైదరాబాద్కు చెందిన శరత్ చంద్ర, వీరభద్రరావు కుటుంబ సభ్యులు దైవదర్శనం కోసం కారులో భద్రాచలం వెళ్తున్నారు. సింగరాజుపల్లి సబ్ స్టేషన్ సమీపం వద్దకు రాగానే ప్రమాదం జరిగింది.
కారులో ప్రయాణిస్తున్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. అందులో నుంచి వారిని స్థానికులు బయటకు తీశారు.
ఇదీ చూడండి: హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల బారులు