హైదరాబాద్ దుర్గంచెరువు తీగల వంతెనపై కారు ప్రమాదం జరిగింది. వంతెనపై వేగంగా వెళ్తుండగా టైరు పేలి కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. మాదాపూర్ నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇదీ చదవండి: విష ప్రయోగంతో హోటల్ యజమాని హత్య